Monday, 26 September 2016

పండగల పూట.. ఈ-కామ్ ఆఫర్ల వరద

Tags

పండగల సీజన్‌ దగ్గర పడుతోంది. దేశంలో పెద్ద పండగలైన దసరా, దీపావళి ఈసారి అక్టోబర్‌ నెలలోనే వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇ-కామర్స్‌ కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు పకడ్బందీ ఆఫర్లతో సిద్ధమయ్యాయి. సంవత్సర కాల స్తబ్దత తీరేలా ఇదే నెలలో పెద్ద ఎత్తున అమ్మకాలను పెంచుకోవాలన్నది ఇ-కామ్‌ దిగ్గజాల ప్రధాన లక్ష్యం. ఇప్పటికే తమ ప్రత్యేక సేల్‌ గురించి కంపెనీలు ప్రచారం మొదలుపెట్టాయి.

 

ఇ-కామ్‌ రంగంలో ప్రధాన కంపెనీలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, స్నాప్‌డీల్‌ కంపెనీలు అక్టోబర్‌లో పెద్ద ఎత్తున ఆఫర్లను ఇవ్వనున్నాయి. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ వరకు అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ పేరుతో అమ్మకాల ను నిర్వహించనుంది. 
ఈ సందర్భంగా వివిధ ఉత్పత్తులపై పెద్ద ఎత్తున డిస్కౌంట్లను ఆఫర్‌ చేయడంతోపాటు వేగవంతంగా డెలివరీ చేయనున్నట్టు సం స్థ చెబుతోంది. స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లు, లాప్‌టాప్స్‌, పీసీలు, మ్యూజికల్‌ ఇన్‌స్ర్టూమెంట్లు, స్టేషనరీ ఉత్పత్తులు, పుస్తకాలు, బేబీ కేర్‌ ఉత్పత్తులు, బొమ్మలు, దుస్తులు, యాక్సెసరీలు, షూస్‌, బ్యూటీ ఉత్పత్తులు వంటి వాటిపై ఆకర్షణీయమైన ఆఫర్లు ఉంటాయని కంపెనీ చెబుతోంది. ఉత్పత్తులను తొందరగా డెలివరీ చేయడానికి ఉపయోగపడే 24 ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు ఈ సంస్థకు ఉన్నాయి. డిసెంబర్‌ లోపే మరో 3 సెంటర్లను కూడా ప్రారంభించడానికి అమెజాన్‌ సన్నద్ధమవుతోంది. వీటి ద్వారా త్వరగా ఉత్పత్తులను డెలివరీ చేసే అవకాశం ఏర్పడుతుంది. పండగల సీజన్‌లో పోటీ కంపెనీల మార్కెట్‌ వాటాను కూడా హస్తగతం చేసుకోవాలనుకుంటోంది.

ఇక ఫ్లిప్‌కార్ట్‌ అక్టోబర్‌ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’ సేల్‌ను నిర్వహించనుంది. కస్టమర్లను ఆకర్షించే వ్యూహంలో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, టీవీలు, భారీ అప్లయెన్సె్‌సపై ఎలాంటి అదనపు భారం లేని ఈఎంఐ సదుపాయాన్ని ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. ‘బిగ్‌ బిలియన్‌ డే’ సేల్‌ సందర్భంగా అమ్మకాలను పెద్ద ఎత్తున పెంచుకోవడం ఫ్లిప్‌కార్ట్‌కు తప్పనిసరి పరిస్థితిగా మారిపోయింది. కొత్త కస్టమర్లను ఆకర్షించి విక్రయాలను పెంచుకుంటే కంపెనీ మరిన్ని నిధులను ఆకర్షించడానికి అవకాశం ఏర్పడనుంది. మరో ఇ-కామర్స్‌ దిగ్గజం స్నాప్‌డీల్‌ ‘అన్‌బాక్స్‌ దీవాళి సేల్‌’ పేరుతో అక్టోబర్‌ 2వ తేదీ నుంచి 6వ తేదీ వరకు అమ్మకాలను నిర్వహించనుంది. హోమ్‌ అప్లయెన్సెస్‌, ఎలక్ర్టానిక్స్‌, మొబైల్స్‌, హోమ్‌ ఫర్నీషింగ్‌, ఫర్నీచర్‌, ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ధరలను ఈ సంస్థ ఆఫర్‌ చేయనుంది. వివిధ ఉత్పత్తులపై గంటల వారీగా అమ్మకాలను సంస్థ నిర్వహించనుంది. ఇందులో కొన్ని ఉత్పత్తులపై 70 శాతం వరకు డిస్కౌంట్‌ను కూడా ఆఫర్‌ చేయనుంది.

అమ్మకాలపై ప్రభావం.. పెద్ద ఎత్తున ఆఫర్లుంటాయని ఇ-కామర్స్‌ సంస్థలు చెబుతున్నప్పటికీ ఈసారి అమ్మకాలపై ప్రభావం ఉండవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. భారీ ఎత్తున డిస్కౌంట్లు ఇవ్వరాదన్న పారిశ్రామిక విధానం, ప్రమోషన్‌ విభాగం (డిఐపిపి) మార్గదర్శకాల నేపథ్యంలో ఆఫర్లు అంత ఆకర్షణీయంగా ఉండకపోవచ్చని అంటున్నారు. అయినప్పటికీ పండగల సీజన్‌లో అమ్మకాలు ఎక్కువగానే ఉంటాయన్న ఆశతో డెలివరీ, లాజిస్టిక్స్‌ సామర్థ్యాలు పెంచుకోవడానికి కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌ అమ్మకాలు క్షీణించడంతో ఇ-కామ్‌ కంపెనీలకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఇన్వెస్టర్ల నుంచి కూడా ఒత్తిడి పెరుగుతోంది. జనవరి-మార్చి త్రైమాసికంలో ఈ కంపెనీల విక్రయాలు 19 శాతం మేర తగ్గ గా.. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికంలో అమ్మకాలు 5-10 శాతం క్షీణించాయి. ఈ నేపథ్యంలో వచ్చే పండగల సీజన్‌పైనే కంపెనీలు ఆశలు పెట్టుకున్నాయి.

Wednesday, 21 September 2016

సామాన్యుడే కదా...ఏం చేస్తాడులే అనుకుంటే కేంద్ర ప్రభుత్వ బృందాన్నే దింపాడు

Tags
ఎప్పుడూ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌ అంటూ కూర్చోపోతే కాస్త బయటతిరిగి రావచ్చు కదా! నలుగురిలో కలవకుండా ఇదెక్కడి చోద్యం! అంటూంటారు ఇంట్లో పెద్దవాళ్ళు. కానీ కేవలం సరదాగా గడపడానికి, ఫోటోలు షేర్‌ చేసుకోవడానికే కాక నిత్యజీవితంలో ఎదు రయ్యే సమస్యలను కూడా సామాజిక మీడియా ద్వారా పరిష్కరించుకోవచ్చని నిరూపించాడు గోవింద్‌ నారాయణ్‌! ఒకే ఒక్క ట్వీట్‌తో తాను ప్రయాణిస్తున్న రైల్లో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించాడు. 
 
      బర్మార్‌ ఎక్స్‌ప్రెస్‌లో బికనీర్‌కు బయలు దేరాడు గోవింద్‌ నారాయణ్‌. టిటిఇని అడిగి కోచ్‌ నెంబర్‌-ఎస్‌6 లో ఒక సీటులో కూర్చున్నాడు. రిజర్వేషన్‌లేని ప్రయాణికులు సీటు కోసం 15 రూపాయలు సమర్పిస్తున్నారుగానీ రిసీట్‌ ఇవ్వటం లేదు టిటిఇ. బిల్లు ఇమ్మని ఎవరూ అడగడం లేదు. కానీ గోవింద్‌ కూడా తనకు పట్టనట్టు కూర్చోలేదు. పదేపదే టిటిఇ శ్యామ్‌పాల్‌ వెనుక తిరుగుతూ బిల్లు ఇమ్మని అడగసాగాడు. ‘బికనీర్‌లో దిగేలోపు బిల్లు ఇస్తా’నంటూ టిటిఇ కాలక్షేపం చేస్తున్నాడు. ఇక గోవింద్‌ జోధ్‌పూర్‌ స్టేషనకి చేరుకోగానే ట్విట్టర్‌లో లాగినై రైల్వే శాఖకు, రైల్వేమంత్రి సురేష్‌ ప్రభు, ప్రధాని నరేంద్రమోదీ, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం)కి ట్వీట్లు చేశాడు. అతడి ఫిర్యాదు డీఆర్‌ఎం ఆఫీస్‌కు చేరుకున్నట్టు కొద్దిసేపటికే గోవింద్‌కి మెసేజ్‌ వచ్చింది. డీఆర్‌ఎం స్వయంగా గోవింద్‌తో ఫోన్లో మాట్లాడాడు. విజిలెన్స్ ఆఫీసర్‌ ముకేష్‌ గెహ్లాట్‌ ఆధ్వర్యంలో ఒక బృందం జోధ్‌పూర్‌లోనే రైలెక్కింది. టిటిఇ రికార్డు లన్నీ ఈ బృందం చెక్‌ చేసి డీఆర్‌ఎంకి రిపోర్ట్‌ చేసింది. వెంటనే శ్యామ్‌పాల్‌ని సస్పెండ్‌ చేస్తూ డి.ఆర్‌.ఎం ట్వీట్‌ చేశాడు. దాంతో మార్తా స్టేషన్లోనే టిటిఇని దింపేశారు. ఒక్క ట్వీట్‌తో అవినీతి టిటిఇ సస్పెండ్‌ అయ్యాడు. ఇలా పౌర సమస్యల పరిష్కారానికి సామాజిక మీడియాను కూడా ఉపయోగించుకోవచ్చు! గోవింద్‌ భలే చేశాడు కదా!-

Tuesday, 20 September 2016

దేశాన్ని మార్చే రూపాయి.............. మోదీ వేసిన సూపర్ ప్లాన్ తో చైనా వణికి పోతుంది, పాకిస్తాన్ పరేషాన్ అవుతుం

Tags



దేశాన్ని మార్చే రూపాయి.............. మోదీ వేసిన సూపర్ ప్లాన్ తో చైనా వణికి పోతుంది, పాకిస్తాన్ పరేషాన్ అవుతుంది,...............
ప్రతి భారతీయుడు తలచుకుంటే భారత ఆర్మీ అత్యంత శక్తివంతమైన ఆర్మీని చేయ
వచ్చు, దేశం కోసం ఏదో ఒకటి చేయాలని పరితపించే ప్రతి భారతీయుడుకి అవకాశం దొరికింది, మీరు సరిహద్దులకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నాకూడా మన సైన్యానికి అండగా నిలవవచ్చు,....
మనం చేయాల్సింది ఒక్కటే రోజుకు ఒక్క రూపాయి చొప్పున్న లేద మూడు నెలలకొక్క సారి వంద రూపాయిలను ఆర్మీ బ్యాంక్ అకౌంటులో వేస్తే అడబ్బు డైరెక్ట్ గా భారతీయ సేనల కోసం ఉపయోగించబడుతుంది ఈ అకౌంట్ లో 1 రూపాయినుంచి లక్ష, కోటిరూపాయిల వరకు జమచేయవచ్చు,
మన దేశాన్నీ ప్రపంచం లొనే అగ్రగామిగా చేసే ప్రయత్నాన్ని మనం ఎందుకు వదులుకుంటం అందుకు నేను సైతం మరి మీరు మనకోసం మనదేశం కోసం నాకోసం నీకోసం మన అందరి కోసం ప్రపంచంలోనే భారత్ ఆర్మీని పవర్ పుల్ గా తయ్యారు చేయడానికి మోదీ వేసిన సూపర్ ప్లాన్ తో చైనా వణికి పోతుంది, పాకిస్తాన్ పరేషాన్ అవుతుంది..........................,
మనం వేసే ఒక్క రూపాయి భారత ఆర్మీని సూపర్ పవర్ చేస్తుంది, ఆ ఒక్కరూపాయి ఇండియా గతిని మార్చేస్తుంది, ఆ ఒక్క రూపాయికి చైనాను తలదన్నే సైన్యం రెడీ అవుతుంది.
ఇప్పటికే దేశ,విదేశాలలో ఉన్న భారతీయులు దీనిపై స్వందించి అకౌంట్ లో డబ్బులు వేస్తున్నారు, అక్షయ్ కుమార్ కూడా 80 లక్షల రూపాయిలను అకౌంట్ లో వేశాడు ,మనం కూడా మన శక్తి కాడికి ఆర్మీకి అండగా నిలబడదాం,south black new Delli_110011, IFSC code: SYNB0009055 అకౌంట్ నెంబర్ , 90552010165915 Syndicate Bank సిండికేట్ బ్యాంక్ .
ఈ అకౌంట్ నెంబర్ ప్రత్యేకంగా భారత్ ఆర్మీ కోసం తయారు చేయ బడింది
Note : ప్రతి మిత్రుడు ఇది చదివి తెలియని వారికోసం షేర్ చేయండి


రేపటి నుంచి విజయవాడకు రైళ్లు బంద్ !

Tags


  • రేపటి నుంచే మెగా లైన్ బ్లాక్‌ 
  • పలు రైళ్లు రద్దు..
  • కొన్ని దారి మళ్లింపు
ఆంధ్రజ్యోతి - గుంటూరు: విజయవాడ రైల్వే స్టేషన్‌లో రూట్‌ రిలే ఇంటర్‌ లాకింగ్‌(ఆర్‌ఆర్‌ఐ) పనులు కారణంగా బుధవారం నుంచి 28వ తేదీ వరకు మెగా లైన్‌ బ్లాక్‌ను తీసుకొంటున్నట్లు సీనియర్‌ డీసీఎం ఉమామహేశ్వరరావు తెలిపారు. ఈ కారణంగా పలు రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు, మరికొన్ని పాక్షికంగా రద్దు చేస్తామని, కొన్నింటిని దారి మళ్లించి నడుపుతామన్నారు.
 
పూర్తిగా రద్దయ్యే రైళ్లు...
నెంబర్‌ 17239/17240గుంటూరు - విశాఖపట్టణం - గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఈ నెల 22, 23, 24 తేదీల్లో.
 
17201/17202 గుంటూరు - సికింద్రాబాద్‌ - గుంటూరు గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లని 23న రద్దు
 
17211 మచిలీపట్నం - యశ్వంతపూర్‌ కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 23న,
 
నెంబర్‌ 17212 యశ్వంతపూర్‌ -మచిలీపట్నం కొండవీడు ఎక్స్‌ప్రెస్‌ 24న రద్దు
 
17644 కాకినాడపోర్టు - చెన్నై ఎగ్‌మోర్‌ - కాకినాడ సర్కారు ఎక్స్‌ప్రెస్‌ రైల్లు ఈ నెల 23న రద్దు చేశారు.
 
పాక్షికంగా రద్దు
నెంబర్‌ 12077/12088 చెన్నై సెంట్రల్‌ - విజయవాడ - చెన్నై సెంట్రల్‌ జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ 21 నుంచి 26 వరకు గుంటూరులోనే నిలిపేసి ఇక్కడి నుంచి తిరుగు ప్రయాణం చేస్తారు.
 
 
17226 హుబ్లీ-విజయవాడ అమరావతి ఎక్స్‌ప్రెస్‌ 21, 22, 23, 17225 విజయవాడ-హుబ్లీ ఎక్స్‌ప్రెస్‌ 22, 23 తేదీల్లో గుంటూరులో నిలిపేసి ఇక్కడి నుంచే పంపిస్తారు.
 
 
12796/12795 సికింద్రాబాద్‌-విజయవాడ- సికింద్రాబాద్‌ ఉద్యోగుల రైలు 21, 22, 23, 24 తేదీల్లో గుంటూరులో నిలిపేసి ఇక్కడే నుంచే తిరిగినడుపుతారు.
 
17216 ధర్మవరం - విజయవాడ రైలును 20, 22 తేదీల్లో, 17215 విజయవాడ - ధర్మవరం రైలును 21, 24 తేదీల్లో గుంటూరు నుంచి నడుపుతారు.
 
గుంటూరు డివిజన్ రైళ్ల మళ్లింపులు
నెంబర్‌ 16032 జమ్ముతావి - చెన్నై సెంట్రల్‌ రైలుని 20న కాచీగూడ మార్గంలో నడుపుతారు.
 
12706/12705 సికింద్రాబాద్‌ - గుంటూరు-సికింద్రాబాద్‌ ఇంటర్‌ సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లని 21 నుంచి 26 వరకు నడికుడి మార్గంలో నడుపుతారు.
 
17221 కాకినాడపోర్టు-లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌ రైలు 21, 24న రాజమండ్రి నుంచి గుణదల, వరంగల్‌, కాజీపేట మార్గంలోకి మళ్లిస్తారు.
 
12805/12806 విశాఖ- సికింద్రాబాద్‌-విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ రైలు 22, 23 తేదీల్లో గుణదల నుంచి కాజీపేట మార్గంలోకి మళ్లిస్తారు.
 
18464 బెంగళూరు సిటీ జంక్షన్ - భువనేశ్వర్‌ రైలును డోన నుంచి కాచీగూడ, కాజీపేట, గుణదల, రాజమండ్రి మార్గంలో నడుపుతారు.
 
17222 లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌ - కాకినాడపోర్టు రైలు 22, 25 తేదీల్లో కాజీపేట మార్గంలో మళ్లిస్తారు.
 
17231 నరసాపూర్‌ - నాగర్‌సోల్‌ రైలును 23న కాజీపేట మార్గంలో మళ్లిస్తారు. 18463 భువనేశ్వర్‌ - బెంగళూరు సిటీ ఎక్స్‌ప్రెస్‌ రైలు 23న కాజీపేట మార్గంలో మళ్లిస్తారు.
 
17204 కాకినాడ టౌన్ - భావనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ నెల 22న రాజమండ్రి - గుణదల మార్గంలో కాజీపేట మీదగా మళ్లిస్తారు.
 
రైళ్ల మళ్లింపులు గుంటూరు మీదగా
నెంబర్‌ 17406 ఆదిలాబాద్‌ - తిరుపతి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలు 20 నుంచి 25 వరకు, నెంబర్‌ 17405 తిరుపతి - ఆదిలాబాద్‌ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ రైలును 21 నుంచి 26 వరకు నడికుడి మార్గంలో గుంటూరు మీదగా నడుపుతారు.
 
12710 సికింద్రాబాద్‌-గూడూరు సింహపురి ఎక్స్‌ప్రెస్‌ రైలును 21, 22 తేదీల్లో నడికుడి మార్గంలో గుంటూరు మీదగా నడుపుతారు.
 
12764 సికింద్రాబాద్‌-తిరుపతి పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ను 22, 23, 25 తేదీల్లో, 12763 తిరుపతి-సికింద్రాబాద్‌ పద్మావతి ఎక్స్‌ప్రెస్‌ని 23, 24, 26 తేదీల్లో తెనాలి, గుంటూరు, నడికుడి మీదగా సికింద్రాబాద్‌కు నడుపుతారు.
 
నాలుగు రైళ్ల రీషెడ్యూల్‌
నెంబర్‌ 22831 హౌరా జంక్షన్-శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం ఎక్స్‌ప్రెస్‌ 21న మధ్యాహ్నం 3.35 గంటలకు బదులు రాత్రి 7.30 గంటలకు బయలుదేరుతుంది.
 
16031 చెన్నై సెంట్రల్‌-జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌ 22న వేకువజామున 5.15 గంటలకు బదులు ఉదయం 8.30 గంటలకు బయలుదేరుతుంది.
 
18047 హౌరా జంక్షన్-వాస్కోడగామా ఎక్స్‌ప్రెస్‌ రైలు 22వ తేదీన రాత్రి 11.30 గంటలకు బదులు 23న ఉదయం 5 గంటలకు బయలుదేరుతుంది.
 
22832 శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం - హౌరా జంక్షన్ ఎక్స్‌ప్రెస్‌ రైలు 23న ఉదయం 7.40 గంటలకు బదులు ఉదయం 11 గంటలకు బయలుదేరుతుంది.
 
ప్యాసింజర్‌ రైళ్ల రద్దు
22 నుంచి 28 వరకు నెంబర్‌ 77221 విజయవా డ-గుంటూరు ప్యాసింజర్‌, 21 నుంచి 28 వరకు 57318 మాచర్ల-బీమవరం జంక్షన ప్యాసింజర్‌, 77230 గుంటూరు - విజయవాడ ప్యాసింజర్‌, 57382 నరసాపూర్‌-గుంటూరు ప్యాసింజర్‌, 67273 విజయవాడ-గుంటూరు ప్యాసింజర్‌, 67274 గుంటూరు-విజయవాడ ప్యాసింజర్‌, 57316 నరసాపూర్‌-గుంటూరు ప్యాసింజర్‌, ఈ నెల 21 నుంచి 24 వరకు, 26 నుంచి 28 వరకు, 77283 గుంటూరు-విజయవాడ ప్యాసింజర్‌, 77284 విజయవాడ-గుంటూరు ప్యాసింజర్‌, 77289 గుంటూరు-విజయవాడ ప్యాసింజర్‌, నెంబర్‌ 57381 గుంటూరు-నరసాపూర్‌ ప్యాసింజర్‌ రైలు 20 నుంచి 27 వరకు రద్దు చేశారు.
 
పాక్షికంగా రద్దు
నెంబర్‌ 56503 బెంగళూరు కంటోన్మెంట్‌ - విజయవాడ ప్యాసింజర్‌ రైలును 21 నుంచి 28 వరకు గుంటూరు వరకే నడుపుతారు.
 
56501 విజయవాడ - హుబ్లీ ప్యాసింజర్‌ రైలు 21 నుంచి 28 వరకు గుంటూరు నుంచి ఉదయం 8.20 గంటలకు బయలుదేరి వెళుతుంది.
 
56502 హుబ్లీ - విజయవాడ రైలు 21 నుంచి 28 వరకు గుంటూరు నుంచి నడుపుతారు.
 

56504 విజయవాడ -బెంగళూరు కంటోన్మెం ట్‌ రైలును 21 నుంచి 28 వరకు గుంటూరు నుంచి నడుపుతారు.

న్యూయార్క్ పేలుళ్ల కుట్రదారుడిని పట్టించిన ఎన్నారై

Tags

వాషింగ్టన్: న్యూయార్క్, న్యూజెర్సీలో పేలుళ్లకు కుట్ర చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం న్యూయార్క్‌లో భారీగా పేలుడు జరిగి 27మంది గాయపడిన సంగతి తెలిసిందే. న్యూజెర్సీలో కూడా పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 
ఈ రెండు ఘటనలకూ ఒకరే కారణమంటూ పోలీసులు ఊహా చిత్రాన్ని విడుదల చేశారు. న్యూయార్క్‌లో ఓ బార్‌ను నడుపుతున్న ఎన్నారై ఈ నిందితుడిని పట్టుకోవడంలో కీలకపాత్ర వహించి అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నాడు. హరీందర్ బెయిన్స్ అనే సిక్కు వ్యాపారి.. తన బార్ ఎదుట ఓ వ్యక్తి పడుకోవడం చూశాడు. బార్ ముందు ఉన్న అతడిని లేపడానికి వెళ్లగానే పోలీసులు విడుదల చేసిన ఊహా చిత్రంలో నిందితుడని గ్రహించాడు. వెంటనే న్యూయార్క్ పోలీసులకు ఫోన్ చేశాడు. 

పాకిస్తాన్ పై భారత్ యుద్ధం? డేట్ కూడా ఫిక్స్?

Tags



      
భారతదేశం సహనం పాటించే కొద్ది, పాకిస్తాన్ అది ఆసరాగా తీసుకుని పాకిస్తాన్‌ నుంచే ఎప్పుడూ మొదటి తూటా దూసుకొస్తుంటుంది. భారత్ సహనాన్ని చేతకానితనంగా పాకిస్తాన్‌ భావిస్తుంది. అందుకే భారత్‌, పాకిస్తాన్‌ దేశాల మధ్య ఇంకోసారి యుద్ధ మేఘాలు కమ్ముకునేలా ఉన్నాయి. భరత్ కి పాకిస్తాన్ కి పాలకల పాలనలో చాలా తేడా ఉంది. పాకిస్తాన్‌లో ప్రజాభిప్రాయం మేరకు పాలకులు వ్యవహరించలేరు. ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్రవాదులు, పాకిస్తాన్‌ ఆర్మీ పెత్తనం ఎక్కువగా ఉంటుంది. కాని భారత ప్రభుత్వం, భారత సైన్యాన్ని ఎప్పటికప్పుడు నెమ్మదించేలా చేస్తుంటుంది. ఓపికను నూరిపోస్తుంటుంది. ఎందుచేతనంటే.. యుద్ధం వల్ల తలెత్తే పర్యవసానాల్ని భారత్ పాలకులకు అవగాహన ఉంది.
కానీ పాకిస్తాన్‌ తమ సైన్యం మెప్పు కోసం, ఆ సైన్యాన్ని నడిపిస్తోన్న తీవ్రవాదుల మెప్పుకోసమే పనిచెయ్యాలి. కాని ఇప్పుడు సహనం క్షీణిస్తుంది. ఒకటికి వందసార్లు తూటాలు వస్తున్నా, ఆ తూటాలు భారత సైన్యాన్నీ, భారత పౌరుల్నీ చంపేస్తున్నా ఓపిక పడుతుంటే లాభం లేదనిపిస్తుంది. ఇక ఓపిక నశించి, తూటా విదల్చక తప్పని పరిస్థితి వచ్చింది. యూరి సెక్టార్‌లో పాకిస్తాన్‌ సైన్యం పంపిన తీవ్రవాదులు మన సైన్యంపై విరుచుకుపడ్డాన్ని భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అందుకే పాకిస్తాన్‌తో తాడోపేడో తేల్చుకోవడానికే భారత ప్రభుత్వం సిద్ధమైంది. యుద్ధ నిర్ణయం వెలువడటమే తరువాయి.

Monday, 19 September 2016

సైనికుల కుటుంబాలను చూస్తే గుండె తరుక్కుపోతోంది : సెహ్వాగ్

Tags
కశ్మీర్ : ఉరీలో జరిగిన ఉగ్రదాడి పలువురిని ఎంతోగానో బాధిస్తోంది. భారత క్రికెట్ జట్టుకు డాషింగ్ ఓపెనర్‌గా ఎన్నో సేవలందించిన వీరేందర్ సెహ్వాగ్ తన బాధను సోషల్ మీడియాలో వరుస పోస్ట్‌లతో తెలియజేస్తూనే ఉన్నాడు.
 
తాజాగా మరోసారి అందరినీ టచ్ చేసే విధంగా స్పందించాడు. ‘17 ప్రాణాలు. ప్రతి ఒక్కరి వెనక ఒక కుటుంబముంది. వారికి ఒక కూతురు ఉంది, ఒక కొడుకు ఉన్నాడు. పైగా మన భారత మాతకు సేవ చేస్తున్నవారు. అలాంటిది ఇలా చూడటం ఎంతో బాధగా ఉంది.’ అంటూ తన భావేద్వేగాన్ని వ్యక్తపరిచారు సెహ్వాగ్.
 

పరిమిత దాడులు?

Tags
  • సైన్యం సిద్ధంగా ఉండాలి
  • త్రివిధ దళాలకు కేంద్రం ఆదేశం
  • పీవోకేలోని ఉగ్ర స్థావరాలపై గురి
  • తేదీ, సమయం త్వరలో ఖరారు
  • దోవల్‌కు బాధ్యత అప్పగించిన మోదీ
  • రాష్ట్రపతితో భేటీ.. మంత్రులతో చర్చలు
  • అదను చూసి దెబ్బ కొడతాం: సైన్యం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కశ్మీర్‌లోని ఉరీ సైనిక శిబిరంపై ఉగ్రవాదుల దాడికి దీటైన సమాధానం చెప్పాలని కేంద్రం నిర్ణయించింది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలను ఇక ఉపేక్షించకూడదని.. వాటికి గట్టి బుద్ధి చెప్పడమే కాక సమూలంగా ఏరివేసే చర్యలను చేపట్టాలని నిశ్చయించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో సోమవారం జరిగిన భద్రతా వ్యవహారాల మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. పాక్‌ తీవ్రవాద సంస్థలకు బుద్ధి చెప్పేందుకు అనుసరించాల్సిన వ్యూహన్ని ఖరారు చేసే బాధ్యతను జాతీయ ర క్షణ సలహాదారు అజిత దోవల్‌కు ప్రధాని మోదీ అప్పగించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ‘‘పఠాన్‌కోట్‌ ఎయిర్‌బే్‌సపై దాడి చేసి ఏడుగురు జవాన్లను హతమార్చినా ఏమీ చేయలేకపోయాం. తాజాగా ఉరీలో ఉగ్రదాడి జరిగింది. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులకు బుద్ధి చెప్పాల్సిందే. మీరేం చేస్తారో నాకు తెలియదు’’ అని మోదీ ఈ భేటీలో అన్నట్లు తెలిసింది. ఉరీ ఘటన అనంతరం దేశవ్యాప్తంగా వస్తున్న విమర్శలు, సలహాలు, సూచనలపై కూడా క్యాబినెట్‌ కమిటీ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. మోదీ నివాసంలో జరిగిన ఈ భేటీలో రక్షణ మంత్రి మనోహర్‌ పరీకర్‌, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, ఎన్‌ఎ్‌సఏ అజిత దోవల్‌, ఆర్మీ చీఫ్‌ దల్బీర్‌సింగ్‌లతో పాటు హోంశాఖ, రక్షణశాఖ సీనియర్‌ అధికారులు పాల్గొన్నారు. సుమారు రెండు గంటలకు పైగా జరిగిన సమావేశంలో ఉరీ ఉగ్రదాడికి ప్రతీకారం ఎలా తీర్చుకోవాలన్న అంశంపైనే ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలిసింది. సీమాంతర ఉగ్రవాదం అణిచివేతకు సిద్ధం కావాలని, పాకిస్థాన్‌ అకృత్యాల గురించి అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లి ఆ దేశాన్ని ఎండగట్టే విధంగా చర్యలు తీసుకోవాలని.. ఉగ్రదాడుల్లో పాక్‌ హస్తానికి సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
 
ఒక్కరోజులో పని పూర్తి చేస్తాం 
పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల ఏరివేతపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఒక్కరోజులో పని పూర్తి చేస్తామని సమావేశంలో పాల్గొన్న ఆర్మీ సీనియర్‌ అధికారులు ప్రధాని మోదీకి భరోసా ఇచ్చినట్లు తెలిసింది. వాస్తవాధీన రేఖ, పాక్‌ సరిహద్దులో ఉన్న ఉగ్రవాద క్యాంపుల సమాచారం తమ వద్ద ఉందని, కేంద్రం రాజకీయ నిర్ణయం తీసుకుంటే పక్కాగా పని పూర్తి చేస్తామని చెప్పినట్లు తెలిసింది. అయితే వ్యూహ, ప్రతివ్యూహాలను ఖరారు చేసే బాధ్యతలను అజిత దోవల్‌కు అప్పగించిన ప్రధాని, యుద్ధం తరహా వాతావరణాన్ని కల్పించకుండా కేవలం తీవ్రవాద స్థావరాలపైనే ఎలా దాడులు చేయాలన్నదానిపై దృష్టి సారించాల్సిందిగా స్పష్టంగా సూచించినట్లు సమాచారం. తీవ్రవాద స్థావరాల మీద దాడులపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని.. దళాలను సన్నద్ధంగా ఉండాల్సిందిగా మాత్రమే సూచించామని కేంద్ర హోంశాఖ అధికారులు తెలిపారు. కాగా.. ఈ సమావేశం అనంతరం రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో మోదీ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
 
భద్రతపై సమీక్ష 
ప్రధాని మోదీతో భేటీకి ముందు రాజ్‌నాథ్‌సింగ్‌ నేతృత్వంలో నార్త్‌బ్లాక్‌లోని ఆయన కార్యాలయంలో ఉన్నతస్థాయి అధికారుల సమావేశం జరిగింది. ఆదివారం శ్రీనగర్‌ వెళ్లి క్షతగాత్రులను పరామర్శించిన రక్షణ మంత్రి పరీకర్‌ కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. పంజాబ్‌నుంచి గుజరాత వరకూ తీరప్రాంతంలో భద్రతతో పాటు జమ్మూకశ్మీర్‌ భద్రతపైనాఈ సమావేశంలో సమీక్షించారు. బలగాలన్నీ అప్రమత్తంగా ఉండాలని, ఉరీ తరహా దాడులు పునరావృతమయ్యే అవకాశం ఉన్నందున అందుకు సన్నద్ధంగా ఉండాలన్న నిఘావర్గాల నివేదికలపైనా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు.. ఉరీ ఘటనకు ప్రతిగా భావోద్వేగంతో కూడిన తక్షణ ప్రతిస్పందన ఉండబోదని ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి వర్గాలు స్పష్టం చేశాయి. అన్ని ప్రత్యామ్నాయాలనూ క్షుణ్నంగా పరిశీలించాకనే, అందరి అభిప్రాయాలనూ పరిగణనలోకి తీసుకున్నాకనే.. పక్కా ప్రణాళిక, సమన్వయంతో ప్రభుత్వం దీనిపై చర్యలు తీసుకుంటుందని ఆ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది మయన్మార్‌లో సర్జికల్‌ సై్ట్రక్స్‌ జరిపినప్పటికీ. ఈసారి ప్రత్యర్థి పాకిస్థాన్‌ కాబట్టి ఎలాంటి తొందరపాటు చర్యా తీసుకునే ప్రసక్తి లేదని తేల్చిచెప్పాయి. విదేశాంగ శాఖ సహాయమంత్రి వ్యాఖ్యలు కూడా ప్రభుత్వ ఆలోచన తీరుకు అద్దం పట్టే విధంగానే ఉన్నాయి. ఈ దాడి ఎలా జరిగిందో, లోపాలు ఎక్కడున్నాయో విశ్లేషించుకోవాలని, ఏదైనా చర్య తీసుకోబోయే ముందు కశ్మీర్‌ అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఆయన పేర్కొనడం గమనార్హం.

అదును చూసి దెబ్బ కొడతాం: సైన్యం 
ఉరీ ఘటన నేపథ్యంలో మన సైన్యం దీటుగా స్పందించాలని.. దెబ్బకుదెబ్బ తీయాలని దేశవ్యాప్తంగా పలువురు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో దీనిపై ఆర్మీ స్పందించింది. ఈ అంశంపై తాము అనుకున్నప్పుడు, తాము అనుకున్నచోట స్పందించే హక్కు తమకుందని మిలటరీ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రణ్‌బీర్‌ సింగ్‌ తేల్చిచెప్పారు. గత 3-4 సంవత్సరాలతో పోలిస్తే చొరబాట్లు పెరిగాయని 2016లో ఇప్పటికే 17 చొరబాటు యత్నాలను భారత సైనికులు అడ్డుకున్నారని ఆయన వివరించారు. ఈ ఏడాది జమ్ముకశ్మీర్‌లో 110 మంది ఉగ్రవాదులు చనిపోగా.. వారిలో 31 మంది సరిహద్దులు దాటుతున్నసమయంలో భారత సైన్యం చేతిలో హతమైనవారేనని వెల్లడించారు. ‘‘నియంత్రణ రేఖ వెంబడి, సరిహద్దుల్లోని మారుమూల ప్రాంతాల్లో ఉగ్రవాదులపై చర్యలు చేపట్టినప్పుడు భారత సైన్యం గణనీయమైన నిగ్రహం పాటించింది. అయితే, అలాంటి తీవ్ర దాడులు, హింసాత్మక ఘటనల విషయంలో ఎలా వ్యవహరించాలో అలా దీటుగా సమాధానం చెప్పగల సత్తా మాకు ఉంది’’ అని స్పష్టం చేశారు. మరోవైపు.. ఉరీ దాడికి ప్రతి దాడి తప్పక ఉంటుందని, ఆ దాడి ఎలా? ఎప్పుడు? అనే విషయాలను వెల్లడించలేమని ఆర్మీలోని ఉన్నతాధికార వర్గాలు పేర్కొన్నాయి.

నేను పాక్ కు వెళ్లను: మోడీ

Tags
పాకిస్తాన్ లో జ‌ర‌గ‌బోయే సార్క్ స‌ద‌స్సుకు హాజ‌రుకాన‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మెడీ తెలియ‌జేశారు.
రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ తో భేటీ అయిన సంద‌ర్భంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. జమ్ము కాశ్మీర్‌లోని యురి సెక్టార్‌లో జ‌రిగిన ఉగ్ర‌దాడిపై మంత్రిని ఆరా తీశారు ప్ర‌ధాని. సైనిక స్థావరంపై పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడిచేసిన తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ అంశంపై ప్రధానికి వివరించారు పారిక‌ర్. యురీలోని సైనిక స్థావరంపై నిన్న తెల్లవారుజామున ఉగ్రవాదులు చేసిన దాడిలో 17 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా ఇవాళ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మ‌రో ముగ్గురు సైనికులు ప్రాణాలొదిలారు. దీంతో చనిపోయిన వారి సంఖ్య 20కి చేరింది.

జగద్గిరిగుట్టలో స్వల్ప భూకంపం..

Tags
జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్టలోని పాపిరెడ్డినగర్‌లో సోమవారం అర్థరాత్రి స్వల్వ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రెండు సెకన్లపాటు భూమి కంపించింది. భూమి ఒక్కసారిగా కంపించడంతో అక్కడి ప్రజలంతా భయంతో ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. భయాందోళనకు గురైన పాపిరెడ్డి నగర ప్రాంత నివాసులంతా రోడ్లపైనే ఉండిపోయారు.

ఈ రోజు యువరాజ్ కు వెరీ స్పెషల్

Tags
ఈ రోజు క్రికెట్ అభిమానులకు చిరస్మరణీయమైనది.  డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కు వెరీ వెరీ స్పెషల్. సరిగ్గా తొమ్మిదేళ్ల క్రితం ఇదేరోజు యువరాజ్ ఆడిన సంచలన ఇన్నింగ్స్ గుర్తుండే ఉంటుంది.

2007లో తొలి టి-20 ప్రపంచ కప్ ను దక్షిణాఫ్రికాలో నిర్వహించారు. సెప్టెంబర్ 19న ఇంగ్లండ్, టీమిండియాకు మ్యాచ్ కు డర్బన్ ఆతిథ్యమిచ్చింది. భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు గంభీర్, సెహ్వాగ్ జట్టుకు 136 పరుగుల శుభారంభం అందించారు. ఇన్నింగ్స్ 17వ ఓవర్లో రాబిన్ ఊతప్ప  అవుటయ్యాడు. అప్పటికి స్కోరు 155/3. మరో మూడు ఓవర్లు మిగిలున్నాయి. ఆ సమయంలో యువీ ఐదోస్థానంలో బ్యాటింగ్ కు దిగాడు. యువీ ఆడిన తొలి ఆరు బంతుల్లో మూడు ఫోర్లు బాదాడు. 19 ఓవర్ లో యువీ స్ట్రయికింగ్ కాగా, స్టువర్ట్ బ్రాడ్ బౌలర్. ఈ ఓవర్లో ఎవరూ ఊహించనివిధంగా యువీ అద్భుతమైన రికార్డు నెలకొల్పాడు. బ్రాడ్ వేసిన ఆరుబంతుల్ని యువీ ఆరు అద్భుతమైన సిక్సర్లు సంధించాడు.  స్టేడియంలో, టీవీల ద్వారా మ్యాచ్ చూస్తున్న అభిమానులను యువీ సిక్సర్లతో కనువిందుచేశాడు. టి20క్రికెట్లో ఓ ఓవర్లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన తొలి బ్యాట్స్ మన్ గా, ఓవరాల్ గా క్రికెట్ చరిత్రలో నాలుగో ఆటగాడి యువీ చరిత్ర సృష్టించాడు.  యువీ ఈ మ్యాచ్ లో 16 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లతో 58 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా 18 పరుగులతో గెలిచింది. ప్రపంచ కప్ ను సొంతం చేసుకుంది.

పాక్ ను దెబ్బతీసేందుకు భారత్ వ్యూహం ఇదే!

Tags
జమ్ముకశ్మీర్ లోని యూరిలో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో దాయాది పాకిస్థాన్ ను ఎలా ఎదుర్కోవాలనే విషయమై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన కేబినెట్ సీనియర్ మంత్రులతో భేటీ అయ్యారు. 18 సైనికులను అమానుషంగా పొట్టనబెట్టుకున్న యూరి ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాకిస్థాన్ కు అన్ని విధాలా గట్టి జవాబు చెప్పాలనే డిమాండ్ దేశ ప్రజల నుంచి వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ను గట్టి దెబ్బతీసేందుకు ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు అధికార వర్గాల సమాచారం. అన్ని అంతర్జాతీయ వేదికల మీద దాయాది తీరును ఎండగట్టాలని, దౌత్యపరంగా ఆ దేశాన్ని ఏకాకిని చేయడమే సత్వర లక్ష్యంగా పెట్టుకోవాలని నిర్ణయించినట్టు సమాచారం. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్‌, అరుణ్ జైట్లీ, మనోహర్ పరీకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఆర్మీ చీఫ్ జనరల్ దల్బీర్ సింగ్ సుహాగ్ తోపాటు ప్రధాని కార్యాలయం, రక్షణ, హోం మంత్రిత్వశాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

ప్రతి అంతర్జాతీయ వేదికపైనా పాక్ ను దౌత్యపరంగా ఏకాకిని చేయాలని, ఇందులో భాగంగా ఉగ్రదాడుల్లో పాకిస్థాన్ పోషిస్తున్న పాత్రను అంతర్జాతీయంగా బట్టబయలు చేసేలా స్పష్టమైన ఆధారాలు సేకరించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యంగా త్వరలో జరగనున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల్లో దాయాదికి గట్టి బుద్ధి చెప్పాలని నిశ్చయించినట్టు సమాచారం. పాక్ ను కార్నర్ చేసేందుకు అందుబాటులో ఉన్న ఇతర ప్రత్యామ్నాయాలపై కూడా ఈ సమావేశంలో చర్చించినప్పటికీ, వాటిని మరింతగా చర్చించి సమగ్ర నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.

Saturday, 17 September 2016

ఏపీ పోలీస్ ట్రాన్స్‌పోర్ట్‌లో కానిస్టేబుల్‌ పోస్టులు

Tags
ఏపీ పోలీస్ ట్రాన్స్‌పోర్ట్‌లో కానిస్టేబుల్‌ పోస్టులు
http://edu.andhrajyothy.com/EduNotificationArticle.aspx?SID=305351

Bol Baby Bol Atho Athamma Song by Hina

Tags
Bol Baby Bol Atho Athamma Song by Hina at Bol Baby Bol stage.just 3 years old...

Daimond Mines Found in Andhra Pradhesh Vajrakarur in Ananthapur..

Tags

Pawan Kalyan - Always Forget His Things On Stage - Jana Sena Public Meeting -

Tags
Pawan Kalyan