వాషింగ్టన్: న్యూయార్క్, న్యూజెర్సీలో పేలుళ్లకు కుట్ర చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. మూడు రోజుల క్రితం న్యూయార్క్‌లో భారీగా పేలుడు జరిగి 27మంది గాయపడిన సంగతి తెలిసిందే. న్యూజెర్సీలో కూడా పేలుడు పదార్ధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ రెండు ఘటనలకూ ఒకరే కారణమంటూ పోలీసులు ఊహా చిత్రాన్ని విడుదల చేశారు. న్యూయార్క్‌లో ఓ బార్‌ను నడుపుతున్న ఎన్నారై ఈ నిందితుడిని పట్టుకోవడంలో కీలకపాత్ర వహించి అందరిచేతా శభాష్ అనిపించుకుంటున్నాడు. హరీందర్ బెయిన్స్ అనే సిక్కు వ్యాపారి.. తన బార్ ఎదుట ఓ వ్యక్తి పడుకోవడం చూశాడు. బార్ ముందు ఉన్న అతడిని లేపడానికి వెళ్లగానే పోలీసులు విడుదల చేసిన ఊహా చిత్రంలో నిందితుడని గ్రహించాడు. వెంటనే న్యూయార్క్ పోలీసులకు ఫోన్ చేశాడు.

EmoticonEmoticon