భారతదేశం సహనం పాటించే కొద్ది, పాకిస్తాన్ అది ఆసరాగా తీసుకుని పాకిస్తాన్ నుంచే ఎప్పుడూ మొదటి తూటా దూసుకొస్తుంటుంది. భారత్ సహనాన్ని చేతకానితనంగా పాకిస్తాన్ భావిస్తుంది. అందుకే భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఇంకోసారి యుద్ధ మేఘాలు కమ్ముకునేలా ఉన్నాయి. భరత్ కి పాకిస్తాన్ కి పాలకల పాలనలో చాలా తేడా ఉంది. పాకిస్తాన్‌లో ప్రజాభిప్రాయం మేరకు పాలకులు వ్యవహరించలేరు. ప్రభుత్వ నిర్ణయాలపై తీవ్రవాదులు, పాకిస్తాన్ ఆర్మీ పెత్తనం ఎక్కువగా ఉంటుంది. కాని భారత ప్రభుత్వం, భారత సైన్యాన్ని ఎప్పటికప్పుడు నెమ్మదించేలా చేస్తుంటుంది. ఓపికను నూరిపోస్తుంటుంది. ఎందుచేతనంటే.. యుద్ధం వల్ల తలెత్తే పర్యవసానాల్ని భారత్ పాలకులకు అవగాహన ఉంది.
కానీ పాకిస్తాన్ తమ సైన్యం మెప్పు కోసం, ఆ సైన్యాన్ని నడిపిస్తోన్న తీవ్రవాదుల మెప్పుకోసమే పనిచెయ్యాలి. కాని ఇప్పుడు సహనం క్షీణిస్తుంది. ఒకటికి వందసార్లు తూటాలు వస్తున్నా, ఆ తూటాలు భారత సైన్యాన్నీ, భారత పౌరుల్నీ చంపేస్తున్నా ఓపిక పడుతుంటే లాభం లేదనిపిస్తుంది. ఇక ఓపిక నశించి, తూటా విదల్చక తప్పని పరిస్థితి వచ్చింది. యూరి సెక్టార్‌లో పాకిస్తాన్ సైన్యం పంపిన తీవ్రవాదులు మన సైన్యంపై విరుచుకుపడ్డాన్ని భారత ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అందుకే పాకిస్తాన్‌తో తాడోపేడో తేల్చుకోవడానికే భారత ప్రభుత్వం సిద్ధమైంది. యుద్ధ నిర్ణయం వెలువడటమే తరువాయి.

EmoticonEmoticon