కశ్మీర్ : ఉరీలో జరిగిన ఉగ్రదాడి పలువురిని ఎంతోగానో బాధిస్తోంది. భారత క్రికెట్ జట్టుకు డాషింగ్ ఓపెనర్‌గా ఎన్నో సేవలందించిన వీరేందర్ సెహ్వాగ్ తన బాధను సోషల్ మీడియాలో వరుస పోస్ట్‌లతో తెలియజేస్తూనే ఉన్నాడు.
తాజాగా మరోసారి అందరినీ టచ్ చేసే విధంగా స్పందించాడు. ‘17 ప్రాణాలు. ప్రతి ఒక్కరి వెనక ఒక కుటుంబముంది. వారికి ఒక కూతురు ఉంది, ఒక కొడుకు ఉన్నాడు. పైగా మన భారత మాతకు సేవ చేస్తున్నవారు. అలాంటిది ఇలా చూడటం ఎంతో బాధగా ఉంది.’ అంటూ తన భావేద్వేగాన్ని వ్యక్తపరిచారు సెహ్వాగ్.

EmoticonEmoticon